రానా 'అరణ్య'కు అదీ ఓ సమస్య
on Mar 19, 2020
కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సినిమాల్లో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన 'అరణ్య' ఒకటి. తెలుగుతో పాటు హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళంలో 'కాండన్'గా ఏప్రిల్ 2న ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. నిర్మాతల ప్లాన్స్ మీద కరోనా కనీళ్లు చల్లింది. థియేటర్లు మూసి వేయడం, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆందోళన చెందడం, ఎక్కువమంది ప్రజలు ఒకచోటకు చేరితే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వంటివి దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పటికి ఇప్పుడు పరిస్థితులు చక్కబడినా... సినిమాను వెంటనే విడుదల చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే... ఇంకా సినిమా పనులు పూర్తి కాలేదు.
'అరణ్య' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముంబైలో జరుగుతున్నాయి. కరోనా కారణంగా అక్కడ స్టూడియోలుమూసి వేశారు. సినిమా డీఐ, మిక్సింగ్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి పూర్తి కావడానికి కనీసం 15 రోజులు కావాలి. ఈ సినిమాకు అదీ ఓ సమస్య అన్నమాట. ఒకవేళ పరిస్థితులు చెక్కబడి వెంటనే పనులు మొదలైతే ఏప్రిల్ నెలాఖరుకు థియేటర్లలోకి సినిమా వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
