పవన్ వద్దు మొర్రో అంటున్నాడట!
on Oct 30, 2014
కత్తి సినిమాని పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడట, ప్రస్తుతం ఈ సినిమా కోసం తగిన దర్శకుడిని వెదుతుకున్నాడట... అంటూ టాలీవుడ్‌లో నాలుగైదు రోజుల నుంచి ఎడతెగని ప్రచారం జరుగుతూనే ఉంది. పవన్ కత్తి సినిమా చూశాడని, చాలా ఇంప్రెస్ అయ్యాడని, గబ్బర్ సింగ్ 2ని కూడా పక్కన పెట్టి, ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నట్టు టాలీవుడ్‌లో చెప్పుకొన్నారు. కానీ అంత సీన్ లేదని తేలిపోయింది. పవన్ ఈ సినిమాని చేయడం లేదని తేలిపోయింది. ఈ సినిమా పవన్ చేస్తానంటే తెలుగులో రీమేక్ చేద్దామని నిర్మాత ఠాగూర్ మధు భారీ ఎత్తున ప్రయత్నాలు చేశారు. పవన్‌కి ఈసినిమా చూపించాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ పవన్ మాత్రం ''నేను ఈ సినిమా చేయను మొర్రో'' అంటున్నాడట. మరీ బలవంతం చేస్తే... పవన్ ఆగ్రహానికి గురి కావల్సివస్తుందని వెనుకడుగు వేసింది కత్తి చిత్రబృందం. పవన్ సినిమా చేస్తాడేమో అని... కత్తి సినిమా తెలుగులో విడుదల చేయకుండా ఆపేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలెట్టేశారు. నవంబరు 7న తెలుగులో కత్తి విడులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.