పవర్ స్టార్ జైలుకు వెళ్తాడట..!!
on Jul 8, 2015
పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ వేసిన జోక్స్ కి కోపం వచ్చిందో ఏమో తెలియదు గానీ, మొన్న ప్రెస్‌మీట్‌లో తాను చేసిన విమర్శలకు రాజకీయ నాయకులు మండిపడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ట్విట్టర్ ద్వార పవన్ వారి విమర్శలకు సమాధానమిచ్చారు. మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు.. కేసులు పెడుతున్నారని.. జైళ్లు.. కోర్టులు ఎదుర్కొనటానికి సంతోషంగా ఎదురుచూస్తానని.. ఆ పనేదో త్వరగా చేయాలన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు.
"సీమాంధ్ర ఎంపీలు పౌరషం నామీద కాదు.. కేంద్రం మీద చూపించండి” అంటూ తొలి పంచ్ ఇచ్చిన పవన్.. ఆ తర్వాత ”నన్ను తిడితే ప్రత్యేక హోదా రాదు” అంటూ మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ముచ్చటగా మూడో ట్వీట్‌లో.. ”ఎంపీలు వ్యాపారాలు చేయడం తప్పు కాదు.. ‘వ్యాపారాలు’ మాత్రమే చేయడం తప్పు” అంటూ సెటైర్ వేశారు. ఐతే ఇంతకుముందులా సైలెంటైపోకుండా.. పవన్ వెంటనే ఈ విమర్శలపై స్పందించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.