మహేష్ షూటింగ్ రాత్రివేళలోనే!
on Aug 2, 2016
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొంది. నిన్నటినుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నైట్ ఎఫెక్ట్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా ఓ వారం రోజుల పాటు రాత్రి వేళల్లో షూటింగ్ నిర్వహించనున్నారు. దీని తరువాత బొంబాయ్, గుజరాత్, పుణె, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మోత్సవం చిత్రం నిరాశ పరచడంతో మహేష్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. తెలుగు, తమిళం రెండు బాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.