కబాలి హిందీ రీమేక్‌లో అమితాబ్..
on Jul 24, 2016
భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూసిన రజనీ "కబాలి" శుక్రవారం థియేటర్లలోకి ల్యాండ్ అయ్యాడు. అయితే భారీ హైప్‌తో రిలీజైన ఈ సినిమా అభిమానులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రజనీ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నా..సాధారణ ప్రేక్షకులను మాత్రం కబాలి డిస్ప్పాయింట్ చేసింది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం రజనీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాడు. వచ్చి మూడు రోజులు కూడా గడవకముందే ఈ సినిమాను రీమేక్ చేయాలని పలువురు భావిస్తున్నారు. రీసెంట్గా సౌత్ సినిమాలపై కన్నేసిన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తాజాగా రజనీ కబాలిని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. వయసు మీద పడుతున్నా తనదైన నటనతో అలరిస్తున్న బాలీవుడ్ మెగాస్తార్ అమితాబ్ బచ్చన్‌ను కబాలి రిమేక్‌లో నటింపజేయాలని భావిస్తున్నారు.