రజనీకాంత్ 168లో నయనతార కూడా!
on Feb 1, 2020
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా రజనీకాంత్ కొత్త సినిమాలో నలుగురు కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే... ఆయన పక్కన ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగులో 'శంఖం', 'దరువు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ 168 వ సినిమా ఇది. ఇందులో కుష్బూ, మీనా, కీర్తి సురేష్ నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. లేటెస్టుగా నయనతార కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ నలుగురిలో రజని కూతురిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. మిగతా ముగ్గురూ రజనీ సరసన కథానాయికలుగా నటిస్తున్నట్టు చెన్నై కోడంబాకం టాక్.
కథానాయకుడు రజనీకాంత్ సరసన నయనతార కు ఇది మూడో సినిమా. మొత్తంగా చూసుకుంటే రజనీతో ఆమెకి ఐదో సినిమా. అప్పుడెప్పుడో పదిహేనేళ్ళ క్రితం 'చంద్రముఖి'లో రజనీకాంత్ సరసన ఆమె నటించారు. తర్వాత ఈ ఏడాది వచ్చిన 'దర్బార్'లో మరోసారి నటించారు. మధ్యలో 'శివాజీ' చిత్రంలో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిశారు. 'కథానాయకుడు'లో అతిధి పాత్ర చేశారు. ఇప్పుడు ఈ సినిమా. సిల్వర్ స్క్రీన్ మీద రజనీకాంత్, నయనతార అనుబంధం అలా కొనసాగుతోంది.
Also Read