రజినీని తిట్టారు... ఇప్పుడు పొగిడారు
on Mar 13, 2020
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి దర్శకుడు భారతీ రాజా స్నేహితుడే. అయినప్పటికీ గతంలో రజనీని ఘాటుగా విమర్శించారు. వ్యతిరేకించారు. సూపర్‌స్టార్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయనను విమర్శించిన సినీ ప్రముఖుల్లో భారతీ రాజా ఉన్నారు. తమిళనాడుకు తమిళ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని, తమిళ ప్రజలను తమిళవారు పాలించాలని ఆయన వ్యాఖ్యానించారు. రజనీ స్వస్థలం తమిళనాడు కాదు. మరాఠీ కుటుంబంలో జన్మించిన కన్నడిగ. తమిళ ఫీలింగ్ తో రజనీని వ్యతిరేకించారు.
తనకు ముఖ్యమంత్రి కావాలని లేదనీ, పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాననీ, విద్యావంతుడైన యువకుడిని తమ పార్టీ తరపున ముఖ్యమంత్రిని చేస్తామని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన భారతీ రాజాకు అమితానందాన్ని ఇచ్చింది. రజనీకాంత్ సూత్రాలు తమిళనాడుకు మంచి చేస్తాయని ఆయన ప్రశంసిస్తున్నారు. రజనీని పొగుడుతున్నారు. సూపర్‌స్టార్ స్కీమ్‌లను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.