లారెన్స్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్?
on Mar 21, 2020
రజనీకాంత్ 168వ సినిమా 'అన్నాత్తే' విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే, ఆయన తదుపరి రెండు సినిమాలపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. రజనీ 169వ మూవీని ఖైదీ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నిర్మిస్తారనే వార్తలు వెలువడుతుండగా, 170వ సినిమాని ఆయన వీరాభిమాని రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది.
రెండేళ్ల క్రితం రజనీకాంత్ ఇంటికి వెళ్లిన లారెన్స్ ఆయనను డైరెక్ట్ చేయాలనే కోరికను వెల్లడించడంతో పాటు ఒక స్టోరీ లైన్ కూడా వినిపించాడు. అయితే లారెన్స్‌కు చూద్దామని చెప్పిన ఆయన యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో 'పేట' సినిమా చేయడం, అది సూపర్ హిట్టవడం తెలిసిందే. తాజాగా లారెన్స్ మరోసారి సూపర్ స్టార్‌ను కలిపి, ఇంకో కొత్త స్క్రిప్టును వినిపించాడనీ, అది రజనీకి బాగా నచ్చిందనీ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కాకపోతే, తన డేట్ల కోసం ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాలని లారెన్స్‌కు ఆయన చెప్పాడు.
శివ దర్శకత్వంలో రజనీ చేస్తోన్న 'అన్నాత్తే' మూవీ 2019 నవంబర్‌లో మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగింది. రజనీ సరసన మీనా, ఖుష్బూ నటిస్తుండగా, ఆయన కుమార్తెగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజనీ నటించనున్న సినిమా జూన్‌లో లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
