నేను సేఫ్... వదంతులకు రజనీ చెక్
on Jan 29, 2020
డిస్కవరీ ఛానల్ కోసం కర్ణాటకలోని బందిపూర్ అడవుల్లో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం కోసం మంగళవారం రజనీకాంత్ షూటింగ్ చేశారు. రజనీతో బ్రిటిష్ అడ్వెంచరస్ హోస్ట్ బియర్ గ్రిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాం షూట్ చేసేటప్పుడు రజినీకాంత్ గాయాలయ్యాయని నేషనల్ మీడియాతో పాటు రీజినల్ మీడియాలో కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేశాయి. దీంతో రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందో అని ఖంగారు పడ్డారు. ఈ పుకార్లకు రజినీకాంత్ చెక్ పెట్టారు. "నేను 'మాన్ వెర్సెస్ వైల్డ్' కార్యక్రమం షూటింగ్ పూర్తి చేశాను. నాకు ఏ విధమైన గాయాలు కాలేదు. కాకపోతే చిన్న చిన్న రాళ్ల వల్ల కొన్ని గీతలు పడ్డాయి. అయామ్ ఆల్ రైట్" అని అన్నారు. క్షేమం గా ఉన్నట్టు ఒక న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. దాంతో రజనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హ్యాపీగా ఫీలయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
