జై లవకుశ పాటలు అదరహో... (ఆడియో రివ్యూ)
on Sep 4, 2017
‘జై లవకుశ’ పాటలు సైలెంట్, హంగామా లేకుండా విడుదల చేశారు. కానీ... ఆ పాటలేమో బయటకొచ్చి హంగామా హంగామా చేస్తున్నాయ్. ఎక్కడా చూసినా... ‘రా..వణా... జై జై జై... శత్రుసేసనా..’ పాటే. నిజం ఒప్పకోవాలి.. పాట కూడా ఓ రేంజ్ లో ఉంది లేండి.
చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ సంగీతం పోటీ పడింది. సంగీతం, సాహిత్యం నువ్వా నేనా అనేలా ఉంది ఆ పాట. దివ్య కుమార్ ఈ పాట పాడిన తీరు కూడా సూపర్బ్. సింపుల్ గా ఇక్కడ పల్లవి వరకు ఇస్తున్నాం పాడుకోండి.
విశ్వ విశ్వ నాయక...రాజ్య రాజ్య పాలక
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక..
శక్తి శక్తి సూచిక... యుక్తి యుక్తి పాచిక..
అహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక...
ఓ... ఏకవీర.. సూర..క్రూర.. కుమార
నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వరా...
ఓ... రక్త ధార.. చోర.. ఘోర.. అఘోరా..
కర్కశంగా రేగుతున్న కాలకింకరా...
రావణా... జై జై జై
శత్రుసేసనా.. జై జై జై
రావణా... జై జై జై
సింహాసనా... జై జై జై
* సాహిత్యం ఇలా ఉంటే.. సంగీతం కూడా దానికి ధీటుగానే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి పాటలంటే చలరేగిపోతాడన్న విషయం తెలిసిందే. కానీ... సాత్వికంగా కనిపించే చంద్రబోస్ కూడా ఈ పాట కోసం కలంతో నిప్పులు కక్కాడు. ఎన్ని పదప్రయోగాలండీ... ఓ చోట ‘సకల జనాకర్షక..’ అంటాడు. మరో చోట ‘అందమైన రూపమున్న అతిభయంకర’అంటాడు. ‘పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకర’ అని ఇంకో చోట అంటాడు. ఈ పాటలోనే రెండో చరణంలో వచ్చే పదం... ‘అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక..’, ‘నరాలు నాగుపాములైన నిర్భయేశ్వరా..’..ఈ రెండు వాక్యాలు చాలు ఇందులో ఎన్టీయార్ కేర్టరైజేషన్ ఏంటో చెప్పడానికి. ఓ విధంగా రావణాసురుడిలో ఉండే లక్షణాలన్నింటినీ ఈ తన కలంతో కుప్పగా పోశాడు చంద్రబోస్. దానికి దేవిశ్రీ మ్యూజిక్ తోడైంది. ఇక తెరపై ఈ పాటలో ‘జై’గా ఎన్టీయార్
ని ఊహించుకుంటే... వైబ్రేషన్సే. ఏది ఏమైనా ‘జై లవకుశ’ ఆల్బమ్ లో ఈ పాటే హైలైట్.
------------------------------------
ఇక రెండో పాట... రామజోగయ్యశాస్త్రి రాశారు. పల్లవి ఇలా ఉంటుంది. జస్ ప్రీత్ జాస్, రానినారెడ్డి
స్వప్నా.. సుందరీ.. స్వర్ణ మంజరి...
చూపుగుచ్చి చేసినావె ఇంజ్యూరీ...
స్వప్నా.. సుందరి.. స్వర్ణ మంజరీ..
ముద్దులిచ్చి చేసుకోవె సంచరీ..
పల్లవిబట్టే అర్థమైవుంటుంది. ఇది ఎలాంటి పాటే. యూత్ కి కిర్రెక్కించే డ్యూయెట్. వెస్ట్రన్ బీట్ లో వండర్ అనిపించేలా ఉంది ఈ పాట కూడా. దేవిశ్రీ ప్రసాద్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ని ఈ పాటతో చూపించాడు. సినిమాలో ఎన్టీయార్, రాశీఖన్నా కాంబినేషన్లో వచ్చే పాటిది. ఇది లవ్ కుమార్ సాంగ్ అని అర్థమవుతుంది. చాలా లవ్ బుల్ గా ఉంది కూడా. ‘ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా... సింగ్ సింగ్ సింగ్ సాంగ్ డాన్స్ తోనా’ అంటూ ట్రెండ్ కి తగ్గట్టు పాట రాశాడు రామజోగయ్య. ఇక ఇలాంటి పాటల్లో ఎన్టీయార్ డాన్సులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా?
---------------------------------------
మూడో పాట మళ్లీ చంద్రబోస్ రాశాడు. హేమచంద్ర పాటాడు
నీ కళ్లలోని కాటుక.. ఓ నల్ల మబ్బు కాదా..
నీ నవ్వులోని వేడుక... ఓ మెరుపు వెలుగు కాదా...
వేగంగా సాగే మెలొడీ సాంగ్. తన అక్షరాలతో అంతర్లీనంగా అద్భుతమైన ప్రేమను చంద్రబోస్ ఆవిష్కరిస్తే... దేవిశ్రీ తన స్వరాలతో పాటకు ప్రాణం పోశాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా ఉందీ పాట. రావణ... పాట మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటే..
ఈ పాట అందరినీ బుట్టలో వేసేసుకుంటుంది. ఎన్టీయార్, నివేదితా థామస్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది. యూత్ కి మాం...చి. కిక్ ఇచ్చే సాంగ్ ఇది.
--------------------------------------
నాలుగో పాట... చంద్రబోస్ రాశాడు. నకాష్ అజీజ్ పాడాడు.
మీ కష్టాలన్నీ దోచేస్తా.. కన్నీళ్లన్నీ దోచేస్తా...
చీకూచింతా దోచేస్తా.. చీకటినంతా దోచేస్తా..
భయాలన్నీ దోచేస్తా.. భారాలన్నీ దోచేస్తా...
అప్పుసొప్పూ దోచేస్తా... ఆపదనంతా దోచేస్తా...
ఇది కూడా సోలో సాగే. ‘రావణా...’ పాట లాగానే.. ఇది కూడా కేరక్టరైజేషన్ ని ఎస్టాబ్లీష్ చేసే సాంగ్ ఇది. ‘కుశ’ కేరక్టరైజేషన్ ని తెలియజేస్తూ వచ్చే పాట ఇది. ఇందులో కుశ దొంగ అని చెప్పకనే చెప్పేలా ఉంది ఈ పాట సాహిత్యం. శ్రీకృష్ణుడి లక్షణాలన్నీ ఆ పాటలో కనిపిస్తున్నాయ్.
--------------------------
ఏది ఏమైనా... విడుదలైన నాలుగు పాటల్లో దేని ప్రత్యేకత దానిదే. అందులో నో డౌట్. వీటిల్లో మూడు పాటలు సోలో సాంగ్స్ కావడం విశేషం. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా పాటలున్నాయ్. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.