త్రిష లేకపోతే నయనతారనంట
on Mar 20, 2014
సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ హీరోగా "పెన్సిల్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే జివి తన రెండవ చిత్రానికి "త్రిష.. ఇల్లేనా నయనతార" అనే టైటిల్ పెట్టారు. అంటే "త్రిష... లేకపోతే నయనతార" అనేది అర్థం. మరి ఈ విషయంపై ఈ ఇద్దరు హీరోయిన్లు ఒప్పుకుంటారో లేదో అనే చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఒక హీరోయిన్ అనుమతి తీసేసుకున్నారట. మరో నాయిక నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకునే పనిలో ఉన్నారు ఈ చిత్ర యూనిట్. కుదిరితే ఈ ఇద్దరిని కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో చేయించాలని అనుకుంటున్నారట. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.