నయన పెళ్లిపై మళ్లీ పుకార్లు
on Feb 7, 2018
దక్షిణాదిలోని అగ్ర కథానాయకల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించింది నయనతార. 30 ప్లస్ ఏజ్‌లోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ దూసుకుపోతోంది. 15 ఏళ్ల కెరీర్‌లో ప్రేమాయణాలు.. వివాదాలతో వార్తల్లో నిలిచిన నయన్‌ని చాలా మంది పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతోందని.. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
మొన్నామధ్య నయన్... విఘ్నేశ్‌కు ఓ ఖరీదైన కారు కొనిచ్చినట్లుగా కూడా సోషల్ మీడియాలో కథనాలు రావడంతో.. ఈ జంట ప్రేమ వ్యవహారం నిజమేనని ప్రచారం తమిళ జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఇంత ప్రచారం జరుగుతున్నా వీరిద్దరూ మాట వరుసకు కూడా స్పందించలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం నయన్-విఘ్నేశ్‌లు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారట. సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుని.. చెన్నైలో కొత్తగా కొన్న విల్లాలో కాపురం పెట్టనున్నారని కోలీవుడ్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
