తెలుగు హీరోలకు అంతలేదు!
on Jan 27, 2018
నయనతారకు ఎదురైనన్ని వివాదాలు... ఇప్పుడున్న ఏ హీరోయిన్ కీ ఎదురై ఉండవ్. అందులో నో డౌట్. అయితే.. ఈ మధ్య వివాదాలకు దూరంగా ఉంటున్న నయన ఉన్నట్టుండి ఓ అనుకోని వివాదంలో ఇరుక్కుంది. అదేంటంటే... ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ఛానల్ కి నయన ఇంటర్ వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్ వ్యూలో నీ అభిమాన నటులెవరు? అనే ప్రశ్నకు నయన సమాధానమిస్తూ... ‘నా అభిమాన నటులు తమిళ హీరోలు విజయ్, అజిత్ అని చెప్పింది. ఆ సమాధానమే... వివాదానికి కారణం. ఈ సమాధానంపై తెలుగు నెటిజన్స్.. నయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘నీకు తెలుగులో నటులే కనిపించలేదా? తెలుగు సినిమా నీకు అంత గౌరవం ఇస్తుంటే... తెలుగు సినిమాకు నువ్విచ్చే గౌరవం ఇదేనా? అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటే... ‘నయనను టాలీవుడ్ నుంచి బహిష్కరించాలి’ అని ఇంకొందరు మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ‘నయన తన అభిప్రాయం చెప్పింది. అందులో తప్పులేదు. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు’ అని కామెట్లు చేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా... తాను క్యాజువల్ గా చెప్పిన ఓ సమాధానం ఇంత రచ్చకు దారి తీయడం నిజంగా బాధాకరమే. నిజానికి టాలీవుడ్ నయనతారకు ఉన్నదానికంటే... ఎక్కువ గౌరవమే ఇచ్చింది. ముఖ్యంగా ‘జై సింహ’ సినిమా విషయంలో ఆమె ఎన్ని షరతులు విధించినా... దానికి తలొగ్గి... అత్యధిక పారితోషికం సమర్పించి మరీ ఆమెతో నటింపజేశాడు నిర్మాత సి.కల్యాణ్. హీరో బాలకృష్ణ సైతం నయన షరతులకు తలొగ్గాడంటే.. నయనకు టాలీవుడ్ ఇస్తున్న గౌరవం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే.. నయన చెప్పింది.. కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని గౌరవించడం అందరి ధర్మం ఏమంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
