కమెడియన్‌కి పడిపోయిన నయనతార?
on Mar 24, 2017
నయనతార.... ఈ కథానాయిక ఎవ్వరికీ అర్థం కాదు. స్టార్ హీరో ల సినిమాలో ఛాన్సొచ్చినా.. ఈజీగా వదిలేసుకొంటుంటుంది. కోట్లు ఇస్తామన్నా... కనికరించదు. ఈ అమ్మడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఒప్పుకొంటుందో కొంచెం కూడా గెస్ చేయలేం. ఈసారీ అదే జరిగింది. స్టార్ హీరోల సినిమాల్ని ఈజీగా చేజార్చుకొంటున్న నయన... ఇప్పుడు ఓ కమెడియన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఆ కమెడియన్ ఎవరో కాదు.. సూరి. తమిళ నాట... సూరి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు. సూరి అంటే.. ఇక్కడ మన బ్రహ్మానందం, ఫృథ్వీలాగన్నమాట. సూరి ఉంటే సినిమా హిట్టే అనే నమ్మకం జనాలకు కలుగుతోంది.
ఆ సూరి ఇప్పుడు హీరో అయ్యాడు. సూరి హీరోగా తమిళంలో ఓ సినిమా మొదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి నయనతార ఒప్పుకొందని సమాచారం. తెలుగులో వెంకటేష్, చిరంజీవి లాంటిస్టార్ హీరోల సినిమాల్నే కాదంటున్న నయనతార.. ఓ కమెడియన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే ఈ సినిమా కోసం నయనకు రూ.3 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారని, అందుకోసమే నయన ఈ సినిమా ఒప్పుకొందని ప్రచారం జరుగుతోంది. డబ్బుల కోసం స్టార్ హీరోయిన్లు ఏమైనా చేస్తారన్న మాట. అందుకు నయనతారే.. ఉదాహరణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
