డ్రగ్స్ వల్ల నయనకు అలా జరిగిందా..?
on Jul 20, 2017
బాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ వుడ్ చూసినా ఇప్పుడు హాట్ టాపిక్ డ్రగ్స్ గురించే..టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వెలుగు చూడటం..12 మంది సినీ ప్రముఖులకి పోలీసులు నోటీసులు జారీ చేయడం..డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సిట్ విచారించడం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఏ ఇష్యూనైనా క్యాష్ చేసుకోవాలంటే సినిమా వాళ్ల తర్వాతే ఎవరైనా. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నయనతార కూడా చేరిపోయింది..మలయాళంలో నయన లీడ్ రోల్‌లో నటించిన పుథియ నియమం సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ మూవీని తెలుగులోకి డబ్ చేస్తున్నారు..ఈ సినిమా కథ డ్రగ్స్‌తో లింకై ఉంటుంది. మాదక ద్రవ్యాలకు బానిసలైన కొంతమంది నయనతారను రేప్ చేస్తారు..వారిపై హీరోయిన్ ఎలా పగ తీర్చుకుంది అన్నదే మిగిలిన కథ..ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తుండగా..వారికి సరిగ్గా టాలీవుడ్ డ్రగ్స్ కేసు బాగా కలిసొచ్చింది. ఈ టైంలో సినిమాని విడుదల చేస్తే అదిరిపోతుంది అనుకున్నారో ఏమో కానీ...తెలుగులో ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉందని ఫిల్మ్‌నగర్ టాక్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
