బాలయ్యతో నయనతార..చిన్న ట్విస్ట్..?
on Aug 26, 2017
వంద సినిమాలు చేసిన ఏ హీరో అయినా సినిమాల విషయంలో కాస్తంత స్పీడు తగ్గిస్తారు కానీ నటసింహ నందమూరి బాలయ్య మాత్రం కుర్రాళ్లను మించిపోతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్‌కు గుమ్మడికాయ కొట్టి..ఆ తర్వాతి రోజే కేఎస్ రవికుమార్ మూవీకి కొబ్బరి కాయ కొట్టారంటే ఆయన స్పీడును అర్థం చేసుకోవచ్చు. మూహుర్తం షాట్ ముగిసిన తర్వాత నుంచి ఈ మూవీలో పనిచేసే టెక్నీషియన్స్ ఒక్కొక్కరి పేరు బయటకు వస్తోంది. అలాగే నయనతార పేరు తెర మీదకు వచ్చింది...ఇంకేముంది నటసింహంతో నయన్ మూడోసారి ఛాన్స్ కొట్టేసింది..అంటూ మీడియా హాడావిడి చేసింది.
అయితే టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వార్త తెగ ప్రచారమవుతోంది. ఈ సినిమాలో నయనతార బాలయ్యకు జోడీగా నటించటం లేదట..తల్లిగా నటిస్తుందనేదే దాని సారాంశం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డితో పాటు గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్, తమిళ్‌లో మరో సినిమా చేస్తోంది నయన్. ఇంత టైట్ షెడ్యూల్‌లో బాలయ్యతో హీరోయిన్‌గా చేయడమంటే అనుమానించదగ్గ విషయమే..అంటే ఆ మూవీలో నయన్‌ది గెస్ట్ రోలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ జనాలు. నయన్ తల్లిగా నటిస్తుంటే మరి హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నట్లు..ఈ డౌట్స్ అన్నింటికి క్లారిఫై రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
