'బాహుబలి' ఫస్ట్ టాక్: రాజమౌళి మ్యాజిక్
on Jul 9, 2015
ప్రేక్షకజనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రం సమయం రానే వచ్చింది. బాహుబలి సినిమా ఎలా వుంటుంది? ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటుందా? రాజమౌళి ఎప్పటిలాగే తన కథ కథనాలతో మాయ చేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరికింది. బాహుబలి ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ముంబైలో బాహుబలి ఫస్ట్ షో చూసిన బాలీవుడ్ ఫేమస్ మూవీ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ బహుబలిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
రాజమౌళి బహుబలితో ఇండియన్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడని, బాహుబలి ఇండియన్ సినిమా తెరపై ఓ అద్భుతమని అన్నాడు. బాహుబలి లో సెట్స్ , గ్రాఫిక్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ సూపర్బ్ గా వున్నాయని అన్నాడు. ముఖ్యంగా బాహుబలి లి ముఖ్యపాత్రలను పోషించిన ప్రభాస్, రానాలు ఇరగదీసారని చెప్పాడు. రాజమౌళి లాంటి దర్శకుడిని తానెప్పుడు చూడలేదని తరన్ ఆదర్శ్ ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ ఒక్క ట్విట్ తో బాహుబలి ఎలా వుంటుందన్న సందేహం అందరిలో తీరిపోయినట్టే!!