పవన్ కొడుకు అకీరా తారక్ ఫ్యాన్..!
on Jun 28, 2018
అభిమానులు హీరోలతో పాటు వారి వారసులని కూడా అభిమానించడం కామన్.. అలానే వారసులు అభిమాన హీరో ఎవరంటే తండ్రి పేరు చెప్పడం కామన్.. కానీ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాకి మాత్రం పవన్ కన్నా తారక్ అంటేనే ఎక్కువ అభిమానమాట.. ఈ విషయాన్ని స్వయంగా పవన్ చెప్పినట్టు తెలుస్తుంది.. హాలిడేస్ గడపడానికి అకీరా, పవన్ దగ్గరికి వచ్చిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా సరదాగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించిన పవన్, అకీరా గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడట.. తన కొడుకు తనకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే బాగా ఇష్టపడతాడని అతని డాన్సుల కోసమే సినిమాలు చూస్తాడని తెలిపాడట.. మొదట ఫ్యాన్స్ కొంత షాక్ అయినప్పటికీ తరువాత హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.. అయితే అకీరాకి తారక్ అంటే ఇష్టమని, రేణూ దేశాయ్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.