జిమ్ అవసరం లేదంటున్న తమన్నా
on Mar 17, 2020
వర్కవుట్స్ చేయడానికి జిమ్ అవసరం లేదని తమన్నా చెబుతోంది. చెప్పడం మాత్రమే కాదు.... చేసి చూపించారు కూడా. ఎక్కడైనా జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రాక్టికల్‌గా వర్కవుట్స్ చేసి చూపించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగోలేదు. కరోనా కారణంగా జిమ్స్ క్లోజ్ చేసేశారు. జిమ్‌లలో ఎక్కువమంది వర్కవుట్స్ చేస్తారు. చెమట పడుతుంది. ఒకరు వర్కవుట్స్ చేసిన వెంటనే చక్కగా శుభ్రం చేసి మరొకరు వర్కవుట్స్ చేసే పరిస్థితులు లేవు. ఒకవేళ ఎవరికైనా కరోనా ఉంటే చెమట ద్వారా మరొకరికి సోకవచ్చని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకని, తమన్నా ఇంటి దగ్గర ఒక జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. అదీ అపార్ట్మెంట్ పార్కింగ్, ఫ్రీ ఏరియాలో. హ్యాపీగా వర్కవుట్స్ కంప్లీట్ చేసుకున్నారు.
"వర్కవుట్స్ చేయడానికి మీకు జిమ్ అవసరం లేదు. మీకు కావలసిందల్లా... మోటివేషన్ మాత్రమే. మీరు ఉంటే చాలు. వర్కవుట్స్ చేసుకోవచ్చు" అని తమన్నా పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే... గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్నారు. రవితేజ సరసన మరో సినిమా చర్చల దశలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
