ఇప్పుడు తమన్నా భోజనంలో ఆ రెండూ లేవు!
on Mar 13, 2020
గోపీచంద్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న సినిమా 'సీటీమార్'. ఇందులో ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తున్నారు. క్యారెక్టర్, సినిమా కోసం తమన్నా తెలంగాణ యాస, భాష నేర్చుకుంటున్నారు. అంతేనా? కబడ్డీ కూడా! కబడ్డీ నేపథ్యంలో, ఆ మాటకొస్తే క్రీడా నేపథ్యంలో తమన్నా చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. సో... కబడ్డీ నేర్చుకోవడం కంపల్సరీ కదా! అన్నిటికంటే ముఖ్యంగా క్యారెక్టర్ కోసం ఫుడ్ విషయంలో తమన్నా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లెటిక్స్ బాడీతో ఉంటారు. కాస్త సన్నగా, స్ట్రాంగ్‌గా ఉంటారు. తమన్నా లావుగా ఏమీ ఉండరు. కానీ, కొంచెం చబ్బీగా ఉంటారు. అందుకని, జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. ఎక్కువసేపు యోగా చేస్తున్నారు. ఈ రెండిటి కంటే ముఖ్యంగా భోజనంలో రెండిటిని పక్కన పెట్టారు. ఇప్పుడు తమన్నా పూర్తిగా నాన్ వెజ్ మానేశారు. ఆమె శాఖాహారిగా మారారు. ఎన్ని రోజులు నాన్ వెజ్ కి దూరంగా ఉంటారో మరి! అలాగే, గోల్డెన్ ఫ్రీ డైట్ తీసుకుంటున్నారు. తిండిలో ఓట్స్, వీట్ వంటివి లేకుండా చూసుకుంటున్నారు. అదీ సంగతి.