కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి వస్తోంది!
on Feb 8, 2020
గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'సీటీమార్'. ఇదివరకు 'యు టర్న్' లాంటి సినిమా నిర్మించిన శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. జ్వాలారెడ్డి అనే కబడ్డీ కోచ్ క్యారెక్టర్‌లో ఆమె కనిపించబోతోంది. ఆమె లుక్‌ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ, ""వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్‌స్పైరింగ్, ఛాలెంజింగ్ రోల్ జ్వాలారెడ్డి. గోపిచంద్‌తో ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్నాను. సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ', 'బెంగాల్ టైగర్' సినిమాల తర్వాత నేను చేస్తోన్న మూవీ ఇది. నా పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా" అన్నారు.
ఇటీవల రాజమండ్రి షెడ్యూలును పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తమన్నాకు సంబంధించిన సన్నివేశాలు ఈ షెడ్యూల్లోనే మొదలయ్యాయి. వేసవికి 'సీటీమార్'ని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ సంకల్పం. గోపీచంద్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నామని ప్రొడ్యూసర్ చెప్పారు. ఇటీవల విడుదల చేసిన గోపీచంద్ లుక్‌కు మంచి స్పందనే వచ్చింది. తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో దిగంగన సూర్యవంశీ, భూమిక, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తారాగణం. మణిశర్మ సంగీత దర్శకుడిగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
