విక్రమ్ తో నయన్ వార్!
on Jul 9, 2015
వామ్మో నయన తార చాలా మొండిదంటున్నారు కోలీవుడ్ జనాలు. కాకపోతే అప్పుడెప్పుడో కోపంలో అన్నమాటకి ఏళ్లు గడిచినా మెట్టుదిగకపోవడమేంటి? ఏం జరిగింది మళ్లీ శింబు, ప్రభు ఎవరైనా లైన్లో కొచ్చారా అంటారా? అదేం లేదుకానీ.... నయన్ కు లేటెస్ట్ గావిక్రమ్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. అస్సలు ఆలోచించకుండా విక్రమ్ తో నటించేది లేదని తేల్చి చెప్పిందట. విక్రమ్ సరసన ఆఫర్ వదులుకుంటావా? ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకమ్మా అంటే....మాట వెనక్కు తీసుకునేది లేదందట.
గతంలో ఓసారి విక్రమ్ సరసన ఛాన్స్ వచ్చిందట. కానీ అదే సమయంలో ఎస్.జె.సూర్య పక్కన ఓసినిమాలో నటిస్తుండడంతో అది పూర్తయ్యాక చేస్తా అందట. దీంతో విక్రమ్ యూనిట్ కి కోపం వచ్చింది. ఏంటీ విక్రమ్ రేంజ్ తెలిదా అన్నారట. దీంతో నయన్ కు ఎక్కడో కాలింది. సో వాట్ అందట.ఇక్కడ రేంజ్ లు ఎవరికి కావాలి....ఖాళీ కావాలి అని ఘాటుగా రిప్లై ఇచ్చిందట. మీరలా మాట్లాడితే విక్రమ్ తో ఇప్పుడే కాదు ఎప్పటికీ నటించను అని కస్సుమందట. అందుకే అప్పటి విషయాన్ని తలుచుకుని లేటెస్ట్ ఆఫర్ వద్దందట. మొత్తానికి ముద్దుగుమ్మ మహా మొండిది అంటున్నారు.