మహేష్ తో మళ్ళీ ఛాన్స్ దక్కింది
on Oct 20, 2014
సూపర్ స్టార్ మహేష్ బాబు తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తోన్న మహేష్, ఈ చిత్రం పూర్తి కాగానే పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల 14రీల్స్ బ్యానర్ లో మహేష్ చేసిన వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. దీంతో నిర్మాతలు చిక్కుల్లో ఇరుకున్నారు. వారితో మళ్ళీ సినిమా చేయడం వల్ల సమస్యలు కొంతలోకొంత పరిష్కరించవచ్చునని మహేష్ భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా మహేష్‌ను కలిసిన శ్రీకాంత్ అడ్డాల ఓ స్టోరీ వినిపించడం, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో స్క్రిప్టు పూర్తి చేసుకునే పనిలో ఈ డైరెక్టర్ నిమగ్నమయ్యాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2015 నుంచి ఈ మూవీ ప్రారంభం కావచ్చునని అంటున్నారు.