నీలాంబరి అందానికి అవాక్కయ్యాడు
on Mar 11, 2015
మన్మధుడు ఈ పేరువింటే మనకు వెంటనే గుర్తొచ్చేపేరు నాగార్జున. అలాంటి నాగార్జునే అందంగా ఉన్నారని పొడిగితే ఎలా ఉంటుంది. ఇంతకీ నాగార్జున పొగిడింది ఎవరిని అనుకుంటున్నారా. మరెవరినో కాదండీ తన సరసన పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక స్టైల్ ను ఏర్పరుచుకున్న హీరోయిన్ రమ్యకృష్ణని. అసలు సంగతి ఏంటంటే నాగార్జున.. రమ్యకృష్ణ కాంబినేషన్ లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 15 ఏళ్లు దాటినా ఆమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని రమ్యకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించాడు.ఎంతైనా మన్మధుడు కదా.