రమ్యకృష్ణ అందానికి ఫిదా అయిపోతున్నారు!!
on Jul 11, 2015
బాహుబలి లో శివగామిగా రమ్యకృష్ణ రెచ్చిపోయింది. బాహుబలి ప్లస్ పాయింట్స్ లో ఫస్ట్ లో నిలిచి, హోల్ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆకర్షించింది. అప్పుడెప్పుడో నరసింహాలో నీలాంబరి తర్వాత మళ్లీ బాహుబలి శివగామి వరకూ రమ్యకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు. దీంతో శివగామితో ఆడేసుకుంది.
నరసింహాలో నీలాంబరిగాను ఆమె నటన, గ్లామర్, రాజసం ఎలా వుందో, బాహుబలిలో శివగామిగా అలాగే వుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె నటన గానీ, రాజసం గానీ ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసిస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం రమ్యకృష్ణ ఎలా వుండేదో ఇప్పటికీ అంతే అందంగా వుందని, ఆమె గ్లామర్ రసహ్యం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.
ముఖ్యంగా బాహుబలి సినిమా చూసినవారందరూ రమ్యకృష్ణ గురించే చర్చలు మొదలుపెడుతున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ లో రమ్యకృష్ణ హావాకి ఇంకొన్నాళ్ల పాటూ తిరుగుండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి శివగామితో రమ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.