ఫ్లాష్..ఫ్లాష్: కుర్రాడితో రమ్య ఎఫైర్..?
on Dec 2, 2016
ఒకప్పుడు సౌత్‌లోని అందరు అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఆ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరైంది. పెళ్లి తర్వాత రమ్య ఇక సినిమాల్లో నటించదు అనుకున్నారంతా కానీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యింది. గతేడాది విడుదలైన బాహుబలిలో శివగామి పాత్రలో నటించి ఆ పాత్రకే ప్రాణం పోసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం..శివగామి పాత్రకు జనం నీరాజనాలు పలకడంతో రమ్యకు వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
పెళ్లయిన తర్వాత..తన వయసుకు తగ్గట్టు పద్దతిగల పాత్రలే ఎంచుకుంటున్న రమ్య తాజాగా ఒక హాట్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మలయాళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ మిడిలేజ్ ఆంటి పాత్రలో టీనేజ్ కుర్రాడితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో నటిస్తుందని సమాచారం. 50కి దగ్గరలో ఉన్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న రమ్య అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని దర్శకనిర్మాతలు ఆమెను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.