ప్రభాస్ కు తల్లిగా రమ్యకృష్ణ..?
on Aug 16, 2013
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". ప్రభాస్ ,రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఈ ఇద్దరు అన్నదమ్ముల యొక్క తల్లి రాజమాత పాత్రకు చాలా మంది సీనియర్ హీరోయిన్ లను అనుకున్నప్పటికీ.. చివరికి రమ్యకృష్ణ ను ఎంపిక చేసారని తెలిసింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "సింహాద్రి" సినిమాలోని ఓ ఐటెం సాంగ్ లో నటించిన రమ్యకృష్ణ.. తాజాగా ఈ "బాహుబలి" చిత్రంలోని తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మరి ఈ విషయం త్వరలోనే అధికారికంగా తెలియనుంది.