"అమ్మ"గా ఒదిగిపోయిన రమ్యకృష్ణ
on Dec 19, 2016
తన సంక్షేమ పథకాలతో, సుపరిపాలనతో తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా కొలువయ్యారు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. నిజజీవిత చరిత్రలను వెండితెర చిత్రాలుగా మలుస్తున్న పలువురు దర్శకనిర్మాతల కన్ను ఇప్పుడు జయ జీవితంపై పడింది. ఎందుకంటే ఆమె జీవితంలో గెలుపు, ఓటమి, చీవాట్లు, చీత్కారాలు, సత్కారాలు ఇలా అన్ని కోణాలు ఉన్నాయి. ఒక కథను తయారు చేయడానికి మన రచయితలకు ఇంతకు మించిన ఎలిమెంట్స్ ఏం కావాలి. వెంటనే అమ్మ జీవితాన్ని తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు..లీడ్ రోల్‌లో రమ్యకృష్ణ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే నిన్న మాత్రం ఇది కాస్త ఎక్కువైంది.
జయ ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ ప్లేస్‌లో పెట్టిన రమ్యకృష్ణ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుమ్ములేపుతోంది. అచ్చం జయలలిత తరహా డ్రెస్సింగ్‌తో రమ్యకృష్ణను అచ్చుగుద్దినట్టు అమ్మలా దింపేశారు. దీనిని చూసిన నెటిజన్లు రమ్యకృష్ణ మాత్రమే అమ్మ పాత్రకు న్యాయం చేయగలరని చెబుతున్నారు. ఎందుకంటే నటిగా రమ్య ట్రాక్ రికార్డు అలాంటిది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా రమ్య చెవిన పడింది..తనను చాలా సార్లు, చాలామంది మీ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగారని కానీ అందుకు సమాధానం ఇవ్వలేదని..అయితే ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత జయలలితగా నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.