Facebook Twitter
విముక్తి ఎప్పుడు?

 

విముక్తి ఎప్పుడు ?


సమాజంలో సమాన హక్కును
స్వరూపంలో కరుణా వాక్కును
కలిగి ఉన్న స్త్రీ పై కక్ష
ఆంక్షల వివక్ష
లేదు రక్ష

వేల కామ కళ్ళ నడుమ 
నడుస్తుంది స్త్రీ
వేవేల కామాంధుల క్రూరత్వంతో
ప్రాణం విడుస్తుంది స్త్రీ

స్త్రీపై గౌరవం
రాతల్లో తప్ప చేతల్లో లేదు
స్త్రీపై గౌరవం
మాటల్లో తప్ప బాటల్లో లేదు

పసిమి నుండి
ముదిమి వరకు
ఉన్మాదపు బాధితులే
పైశాచిక పీడితులే

నైతిక విలువలు నశించిన
నరరూప రాక్షసుల నుండి
నారీ మణులకు విముక్తి ఎప్పుడు ?
ఆడ మనిషిలో అమ్మను చూసినప్పుడు.

 

రచన : వెంకు సనాతని