
జయం జయం జయం
దశరథ రామ జయం
పితృవాక్యపరిపాలకా జయం
మాతృహృదయ పరితోషకా జయం
శత్రువర్గ సమ్మోహితా జయం
మిత్రదళ సర్వశ్రేస్ఠా జయం
నీ త్రోవలో నడయాడితే ఓ రామా
మాకిక జయమే జయమే జయమే!
వరం వరం వరం
కౌసల్య రామ వరం
మందహాసా వరం
మధురవచనా వరం
మనోహరుడా వరం
నీవంటి పుత్రిని
పొందగలిగితే ఓ రామా
మాకది వరమే వరమే వరమే!
ఫలం ఫలం ఫలం
వశిష్ఠ రామ ఫలం
శిష్యచూడామణీ ఫలం
భవ్య సుగుణాలగనీ ఫలం
నిత్య సన్మార్గవర్తీ ఫలం
నీ వినయ విధేయతలు
వీసమైనా వరిస్తే ఓ రామా
మా సుకర్మలన్నీ
సఫలమే సఫలమే సఫలమే!
శుభం శుభం శుభం
సీతారామ శుభం
ఆజానుబాహుడా శుభం
అరవిందాక్షుడా శుభం
ఆనందకారకుడా శుభం
నీ సౌశీల్య సౌందర్యాలు
సుంతైనా సొంతమైతే ఓ రామా
మాకంతా శుభమే శుభమే శుభమే!
విజయం విజయం విజయం
కోదండ రామ విజయం
గుణవంతుడా విజయం
రణతంత్రుడా విజయం
స్థితప్రజ్ఞుడా విజయం
నీ సందర్భ సహిత సంభాషణలు
అనుసరిస్తే ప్రయత్నమేదైనా ఓ రామా
సదా విజయమే విజయమే విజయమే!
-- రవి కిషోర్ పెంట్రాల



