Facebook Twitter
కెమెరామెన్

కెమెరామెన్

 

 

మన ప్రతిరూపాన్ని 
మనల్ని కూడా మరిపించేలా
తన సృజననుపయోగించి
చూడగానే ఆనందమొక్కసారి
ఎదనిండేలా ఎగిరి గంతేసేలా
చాలా కమనీయకాంతులతో
రమణీయ రంగులతో
ఎలా చూడాలో ఇంకెలా నిలబడాలో
తను చూయిస్తూ సిద్ధం చేసి
'రెడీ' అంటూ ఓ క్లిక్ తో 
మనల్ని బందించి మనకందించేది 'కెమెరామెన్'

మనిషిని చూడగానే 
తన మనసులో ఓ ఊహాచిత్రం గీసుకునే చిత్రకారుడు కెమెరామెన్

మన ఆనందానికెపుడు శాశ్వతరూపమిచ్చేవాడు
జీవితంలో జరిగే సంఘటనల్ని మనం చూసుకునేలా 
ఎపుడైనా నెమరేసుకున్న
మనముందు కనిపించే చరిత్ర
కెమెరామెన్ ఓ చరిత్రకారుడే
తరతరాలకు గడిచిన గతాన్ని
విశ్వమంతా పదిలమై 
వాడిపోనిదై వికసిస్తూనే పదిలంగా పదికాలాలకు అందించే జ్ఞాపకాలు ఫోటోలు

ప్రకృతిలో ప్రతి రమణీయతను బందించి
చిన్న చీమ నుంచి అతిపెద్ద డైనోసార్ దాకా ప్రతిజీవిని
పిల్లిని పంజా విసిరే పులిని
చిన్న పిచ్చుకలతో మొదలు
ఎన్నో పక్షులు ఖడ్గమృగాలు
విష సర్పాల కోరలను కొండ కోనలను
కొలను చెరువు లోయలు
సప్తసముద్రాలను క్లిక్ మనిపించి అబ్బురపరిచే సాహసికుడు ఫోటోగ్రాఫర్
మంచు పర్వతాలను 
అగ్నిశిఖలను సైతం 
తన ఆసక్తితో మనకందించేది

ఏదేమైనా వేవేల భావాలను మౌనంగా మాట్లాడించే మహానాయకుడు ఫోటోగ్రాఫర్
కరోనా కాలంలో వీరి జీవితం బేజార్
ఆదుకోవాలి మరి సర్కార్

(జాతీయ కెమెరామెన్ దినోత్సవ సంధర్భంగా)

 

సి. శేఖర్(సియస్సార్)