అమ్మ మాట

ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది.

Mar 1, 2025

కాళీపట్నం ‘జీవధార’:కనుతెరిచిన క్షణం

ఎమర్జెన్సీ రోజులు...ఎంచక్కా యద్దనపూడి సులోచనారాణి ‘బహుమతి’ కథలూ, ఆదివిష్ణు ‘కలెక్టరూ! నన్ను క్షమించు కథలూ’, గొల్లపూడి మారుతీరావు ‘రోమన్ హాలిడే’ కథలూ చదువుకుంటున్నరోజులు. తెలియకుండానే జీవితం చంకనాకిపోతున్న రోజులు.

Feb 27, 2025

దేవుడే ఇచ్చాడు

దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ..

Feb 17, 2025

సున్నపుపొడి శిక్ష.. బీర్బల్ సమయస్ఫూర్తి

ఒకసారి, న్యాయస్థానం సైనికుడికి అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించింది. తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి తినడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు.

Feb 15, 2025

సత్యం.. అబద్ధం

అబద్ధం అందంగా, సత్యం కఠినంగా ఎందుకు ఉంటుది? ఈ చిన్న కథ చదివితే మీకే అర్థమవుతుంది అబద్ధం అందంగా ఉంటుంది కానీ సత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే ఈ నానుడి వెనక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Feb 12, 2025

ఆరాధన

మా పిన్నికూతురు పెళ్లిలో మొదటిసారి పూర్ణని చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉంది. రెండు జడలతో ఉంది. లంగా, ఓణీ మీద ఉంది. ఇంతలేసికళ్లతో, అంత లేతమొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా? ఎవరీ అమ్మాయి? అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే... పూర్ణ వంట బ్రాహ్మణుని కూతురు.

Feb 8, 2025

కలిసి ఉంటే కలదు సుఖం

ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు.

Feb 5, 2025

లౌక్యమూ లేక సౌఖ్యమూ లేదు....

ముక్కుసూటిగా మాట్లాడడం, మొహమ్మీద గుద్దినట్టుగా మాట్లాడడం తప్పురా! అంత నిర్మొహమాటంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే కష్టం. జీవితంలో పైకి రాలేవు. సుమతిశతకకారుడు ఏం చెప్పాడు? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు.

Feb 4, 2025

తులసికోట: గోవ్యాఘ్రసంవాదం

కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం...ఈ నాలుగునెలలూ అమ్మ తులసికోట దగ్గరే ఎక్కువగా గడిపేది. తెల్లారుజామున ఎప్పుడు లేచేదో ఏమో! నేను లేచేసరికి తులసికోట చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండేవి. బంగారురంగులో కోట మెరిసిపోయేది.

Jan 29, 2025

తులసీదాసు దీవెన

గొప్ప రామభక్తుడైన   తులసీదాసు కాశీ క్షేత్రంలో  ఉంటూ రాముని  మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యమూ రాముని కీర్తిస్తూ  భజనలు చేసేవారు. రామనామగానంతో పరిసరాలు మారుమోగేవి.  

Jan 28, 2025

రాం రాం! మధురాంతకం రాజారాం!!

రచయితలనూ, కవులనూ కోల్పోయిన జాతి, తన బాల్యాన్నీ, భవిష్యత్తునీ కూడా కోల్పోతుందని నేనెక్కడో చదివాను. ఆ మాట నిజం అనిపిస్తోందిప్పుడు. అప్పుడు...నేను ‘ఉగాది‘వారపత్రికకు ఎడిటర్ గా ఉన్నప్పుడు...అలా అనిపించలేదు. చాలా ఆశాజనకంగా ఉండేవాణ్ణి. ముప్పయిమూడేళ్లనాటిమాటిది. ఈనాడు, ఈవారాల్లో రిజైన్ చేసిన తర్వాత ‘ఉగాది’ వారపత్రికకి ఎడిటర్ ని అయ్యాను. అయితే ఆ రాని పత్రికకు కాని ఎడిటర్ గా మిగిలిపోయాను. మిగిలిపోతే మాత్రం ఏం? ఎన్ని జ్ఞాపకాలను మూటగట్టుకున్నానో!

Jan 27, 2025

జగమెరిగిన రాజారామమోహనరావు

పత్రికలు కథలు స్వీకరించడంలేదు. రాసిన ప్రతి కథా తిరిగి వచ్చేస్తున్నది. తిరిగివచ్చిన కథలను ఏం చేసుకోవాలి? చించి పారేసే బదులు, పదిమందీ చదివేలా చేస్తే మేలనిపించింది. నాలాంటి వర్ధమాన రచయితలంతా కూడబలుక్కున్నాం. ఓ లిఖిత పత్రిక ప్రారంభించాలనుకున్నాం.

Jan 25, 2025

తండ్రి ఆజ్ఞ

పురాణ కాలంలో మేధాతిథి అనే ముని వుండేవాడు. అతనికి చిరకారి అనే పేరున్న కుమారుడు ఉన్నాడు. చిరకారి బుద్ధిమంతుడు. అతడికి ఒక మంచి అలవాటు ఉంది. ఏదైనా పని అప్పగిస్తే పనిని మొదలు పెట్టే ముందు చక్కగా ఆలోచించేవాడు. ఆ పని జరగడం వల్ల మంచి జరుగుతుందనుకుంటే చేసేవాడు. లేదంటే ఆగిపోయేవాడు.

Jan 23, 2025

సమయస్ఫూర్తి

ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.

Jan 11, 2025

మనస్సాక్షి

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.

Jan 10, 2025

దొరికిన దొంగ

రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్‌ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్‌, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

Jan 9, 2025

చిలుక చేసిన సాయం

అనగనగా రామాపురమనే గ్రామం. ఆ గ్రామంలో సాంబయ్యనే రైతు ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే కొన్ని సంవత్సరాల నుండి కరవు కారణంగా పంటలు పండలేదు. సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసిరాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది.

Jan 8, 2025

తులసి దళం గొప్పతనం!

ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి, వాటిని అమ్ముకుని జీవనం గడుపుతుండేవాడు. ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు.

Jan 4, 2025

నిర్మలమైన భక్తి

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒక రోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి.

Dec 30, 2024

కలిసి వస్తే కుట్టు సూది చాలు!

వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడో వాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతణ్ణి ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడూ, సునందుడూ ఆలోచన చేశారు.

Dec 27, 2024