Facebook Twitter
అపరిచితులవుదామా..!?

అపరిచితులవుదామా..!?

ఒక్కసారి..మరొక్కసారి
అపరిచితులం అవుదామా?
నేనెవ్వరో నీకస్సలు తెలీదు
నాకేమో నీ పరిచయమే లేదన్నట్టు...

జతగా ఎన్ని ఊహల పల్లకీల్లో ఊరేగాం
ఆశల నిచ్చెనలెన్ని ఆకాశాలకేసుకున్నాం
కూల్చలేని గాలి మేడలెన్ని కట్టుకున్నాం
ఉప్పెనల ఆటుపోట్లనెన్ని తట్టుకున్నాం...

నిన్నలా మొన్నలా ఇప్పుడున్నూ
నేనెప్పుడూ మొర పెడుతున్నట్టు
కోరుకున్న గమ్యమోవైపు కవ్విస్తుంటే
వెడుతున్న బ్రతుకు దారింకోవైపు సోలుతూ..

కాలం గాలానికి చిక్కిన చేపల్లె అల్లాడుతుంటే
ఇప్పుడైతే నను వలిచి వరించేవో లేదో
అయినా నేనంత ఆత్రంగా అప్పటిలా
మళ్ళీ నిను సాదరంగా ఆహ్వానించేనో లేనో..

నా కలల వనానికి వసంతమెళ్ళిపోయిందేమో
పిందెలుమెక్కే కోర్కెల కొయిల్లకు తావులేదేమో
ఉవ్వెత్తున పొంగే నా ఏరు ఎండిపోతోందేమో
నువ్వు నావై నాతో ఏ దరికి చేరలేవేమో..

నిరాశ నిలువెల్లా అలముకుంటుదేమో
యదలో నీకిక మునుపట్లా చోటు దొరకదేమో
కష్టమైనా వీడ్కోలు పలుకవా నా ప్రియకామనా
ఒక్కసారి మరొక్కసారి అపరిచితులమవుదాం..

పుల్లటి పండ్లనీ ఓడుమద్దెల్లనీ
ముతక మాటలు మొదలెట్టకముందే
కోర్కెల కోతులూ ఇకచాలు మీరూ దయచేయరూ
మళ్ళీ ఇంకోసారి అపరిచితులమవుదాం!


-- రవి కిషొర్ పెంట్రాల,

లాంగ్లీ, లండన్!