ఉగాది కొత్త పలుకు
ఉగాది
పాట రంజితమై
లోక శోభితమై
నేటి ఆమనిలో
పలుకు పావనివై
గాన కోకిలమ్మ!
వర్ణ సారూప్యాన
వెర్రి ఏకాక్షిలా
పిచ్చి ప్రేలాపనలు
పొల్లు భాషణములను
వల్లె వేయకుసుమీ!
మంచి చెడ్డలను
తప్పు ఒప్పులను
లోటు పాటులను
రాగద్వేషముల్లేకనే
శృతిలోనే ఆలపించుసుమీ!
ఆపన్నుల ఆక్రందనలు
అన్నార్తుల ఆకలికేకలు
రాబందుల రక్కసిచేష్టలు
జనగణములు తెలుసుకొనేట్టు
నలుదిక్కుల గళమెత్తుసుమీ
యుద్ధకాంక్షలు సన్నగిల్లగ
క్షామమన్నది సమీపించక
పిల్లపాపలు చల్లగుండగ
విశ్వశాంతికి అడుగువైపుకు
శాంతిగీతం పాడుముసుమ్మీ!
- రవి కిషోర్ పెంట్రాల

కృషీవలురకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!
Mar 29, 2025
మంచి నడతకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!
Mar 27, 2025
హరిదాసు హరినామ సంకీర్తనలతో జంగమదేవర శంఖపు రవళులతో మా ఊరి ఆస్థాన విద్వాంసులు
Jan 12, 2025
అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్ అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్ళనా పట్నంనుండి స్వీట్స్ పట్టుకురానా! అహ్ ఏంటోనండి ఆరోజుల్లో అయితే...!
Jan 12, 2025
జీవన వాసంతంలో అరుదైన గమ్యందారిని రమ్యంగానే దొరకబుచ్చుకొని ప్రియంగానే ప్రయాణిస్తూ బాటసారి!
Nov 28, 2024
అఖిల తారలు నీ పదపద్మములనుజేరి అమితానురక్తితో కొల్చుటజూచి పూటపూటనా ఇలాగ మినుకుమినుకుమని మెరుస్తుంటి!
Nov 15, 2024
నిలువునా చీల్చిన పచ్చటి చెక్కలా ఆ రెండు మార్గాలు క్షమించండి.. నేను ఆ రెండు మార్గాల్లోనూ ప్రయాణించలేను ఒక్క మార్గంలోనే నేను నిరంతరం నిలబడే వున్నాను
Oct 11, 2024
ఫౌంటైన్లు నదిలో, నదులు సముద్రంలో కలిసిపోతాయి... గాలులు నిరంతరం ఒకదానితో మరొకటి కలసిపోతాయి... అది కూడా.. ఒక మధురమైన భావోద్వేగంతో...
Oct 7, 2024
ఈ జనం ఒంటరిగా బాధపడతారు అలా నేను అలసిపోయేలా చేస్తారు నీ ప్రేమ మత్తులో మునగాలని... ఒక వీరుడి బలాన్ని చేతులారా తాకాలని నేను ఆశించడం తప్పు కాదేమో..
Aug 7, 2024
TeluguOne Services
Copyright © 2000 - 2025, TeluguOne Sahityam - All rights reserved.
|