కత్తుల నిచ్చెన !!
కత్తుల నిచ్చెన !!
శత్రుసేనని చిత్తుచేసి
విజయపు కుర్చీనెక్కేందుకు
ఎన్నికల యుద్ధంలో
కూటమిగా పోరాడదామని!
వి(స్వ)పక్షాల పొత్తువిచ్ఛిన్న ప్రయత్నంలో
కూటమిదారిలో విద్వేష మందుపాతరలు
వాపు బలమనే తప్పుడు చుక్కానీ దిశలు
దిగ్విజయంగా తప్పించుకొని ఒక్కటై(?)!
పిడిబాకుల పదును మాటలతో
ఎదిరిపక్షం వెన్నులో వణుకు తెప్పించక
పదునైన ఎత్తుల కత్తులతో
విపక్షంపై మూకుమ్మడిగా విరుచుకుపడక!
ద్రోహపు పిడిబాకులతో కట్టిన
అనుమానపు కత్తుల నిచ్చెనల మీదనుండి
ఓట్ల సమరానికి సిద్ధం కావాలంటే
మిత్రపక్షాలకు స్థైర్యమెలా వచ్చేనో!
అనుమానపు ప్రయాణం
ఆరాటంలేని ప్రయత్నం
ఆత్మస్థైర్యంలేని పోరాటం
కూటములను ముంచేనో తేల్చేనో!
-- రవి కిషోర్ పెంట్రాల
