TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ప్రజాస్వామ్యం!!
బాలెట్ పేపర్ల రోజుల్లో
ఏ వందో..ఓ పూట కూడో
ఓ గుక్కెడు సారానో
ఓ కుంకుమ భరిణ..
అంతే అంతే ఆ దానికే
ఏక్ దిన్ కా సుల్తాన్స్
బూతుకెల్లి ఓట్లు గుద్దేసేవాళ్ళు
టికెట్లు తీసుకుని బస్సెక్కినట్టే
పక్కాగా బోర్డుమీది గమ్యానికే!
నేడు ఒక్క ఓటుకు ఎన్నివేలో
ఎంత సంపదతో సంతర్పనో
మందు ప్రవాహం ఆగరాదంతే
కుదిరితే అభ్యర్థి ఆస్తిలో వాటాలడుగుడే
ఆపై కులం గోత్రం నక్షత్రం అబ్బో ఎన్నో..
ఆ రోజుకి మహారాజులు
సుతిమెత్తగా మీటనొక్కేస్తే
నేటి EVM హైటెక్ జమానా
విమాన ప్రయాణంలానే ఆకాశంలో
ఎక్కడికనుకొని మారాజులెక్కారో
ఏ ఆగంతుకుడు హైజాక్ చేస్తాడో
ఏ గమ్యస్థానాలకి తీసుకెల్తాడో..
అంతా సెక్యూరిటీ (ఈసి) వాడిదయ
లాలూచీకి సయ్యంటే ఎన్నికలిక ఫార్సే
ప్రజాస్వామ్యామిక గాల్లో ఫ్లైటే
ఆగంతకుల చేతిలో కీలుబొమ్మే
అధికారానికై దొంగదార్లుతొక్కే
దొంగల చేతుల్లో ముమ్మాటికీ కీలుబొమ్మే
ప్రజాస్వామ్యం!! మన ప్రజాస్వామ్యం!!
- రవి కిషొర్ పెంట్రాల