గంగమ్మ
గంగమ్మ
- నీలాల శ్రీనివాసులు
నీ పేరుకు రెండే అక్షరాలు
అమ్మ పేరుకు రెండే అక్షరాలు
గలగల పారేటి సెలయేరు నీవు
శివుని శిరస్సున ఉండేది నీవు
మానవాళికి జీవనాధారం నీవు
ఎండిన మా బ్రతుకుల్లో
వెలుగు నింపేది నీవు
నీకు ఉన్నది ఇద్దరు స్నేహితులు
యమున,సరస్వతి
నిన్ను చూస్తేనే ఆనందం
మాకు పరమానందం,
కరువు కాలంలో మాఆకలిని , దాహాన్ని
తీర్చేది నీవు
అమ్మా..నీ చల్లని చలువకు పాత్రుడనమ్మా
నీలో ఓపిక సహనం
నాకెంతో ఆదర్శం