posted on Sep 28, 2013
పరుగెత్తి పరుగెత్తి
-డా.వై. రామకృష్ణారావు
పరుగెత్తి పరుగెత్తి
పాదాలు నొప్పేమో
నిల్చిపోయింది నీరు
మంచుగడ్డై
ఏరు యవ్వనం
నది నడి వయసు
సాగరం సన్యాసం
నీటికి మరి మోక్షం ?
తీరం చేరేదాకా
తీరని ఉద్వేగం
తీరా చేరాక
ఏదో నిర్వేదం