posted on Sep 21, 2013
ఒక్కణ్ణి ఎక్కడని
వి.బ్రహ్మానంద చారి
ఒక్కణ్ణి ఎక్కడని
వెదకేను నీ కొరకు
ఎక్కడుంటివె వీవు
చుక్కల్లో చేరితివ ?
బిక్కమొగమేసుకొని
ఎక్కిదిగి గడపలూ
నిక్కముగ నీ కొరకె
మ్రొక్కి వేడ్కొంటినె
చిక్కులా పాల్జేసి
చక్కగా పోయితివె
దిక్కు నాకెవరే
ఓ......జాబిలమ్మ