posted on Sep 16, 2013
ఇనుప కమ్మీలపై
- వి. బ్రహ్మనందచారి
ఇనుప కమ్మీలపై
నడిచేటి పొగబండి
కృష్ణమ్మ చేరగనె
వింత సవ్వడి చేయ
అంతలా నవ్వితివె
అందాల బాలా! పాల
పుంతలో దివ్వెలే
వుసురనె నినుజూచి
విచ్చుకత్తుల కొనలు
గుచ్చితివె గుండెలో
పిచ్చినై తిరిగితినె
నా....జాబిలమ్మ