posted on Oct 3, 2013
గువ్వెగిరి పోయింది
బువ్వెగిరి పోయింది
గురుడు అనతి అంది
అవ్వెగిరి పోయింది
గూడు చెదిరిపోయె
వాడ వెలుగే పోయె
ఏడున్న నీ తలపె
నీడల్లె కదిలెనే
గడిలోన వెదకేను
గుడిలోన వెదకేను
కనరాదే నీ జాడ
ఓ......జాబిలమ్మ
వి.బ్రహ్మానంద చారి