posted on Sep 17, 2013
జలపాతం
డా.వై. రామకృష్ణారావు
జలపాతం
ఎంత సాహసి!
అంతెత్తు కొండపై నుండి
అమాంతం దూకుతుంది
బాగా చెప్పావ్
అనిపించుకోనేకన్నా
బాగా చేశావ్
అనిపించుకోవడం మిన్న
గెలుపు మీద
విశ్వాసం లేకుంటే
పోటీ ఎందుకు ?
ప్రత్యర్ధితో భేటి ఎందుకు ?