posted on Oct 12, 2013
సౌందర్యవతి వీవు
- వి.బ్రహ్మానంద చారి
సౌందర్యవతి వీవు
ఆనందమతి నేను
ఇరుడెందములు వూగ
అరుదెంచె శ్రీలక్ష్మీ
ఏ నందనోద్యాన
నవపారిజాతమ్మొ
ఇంతింతగా ఎదిగి
అంతయూ తానాయే
శ్రీనివాసుని కరుణ
ఆనంద పద్మమై
వికసించు చిరునగవు
ఓ......జాబిలమ్మ