posted on Oct 11, 2013
పావురం రెక్కలకు
- డా.వై. రామకృష్ణారావు
పావురం రెక్కలకు
రక్తం మరకలేమిటి ?
వార్త పత్రికపై
వాలిందేమో !
వీచి వీచీ
అలసిపోయిందేమో
పాపం! స్తంభించిపోయింది
పవనం.
ఆకాశం తలుపు
తెరిచి చూడు
సూర్యుడి రహస్యం
తెలుస్తుందేమో!