- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
- న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం!
- మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
- Indian American Teens Adhvik And Yuktha Captivate Audiences With Their Indian Classical Art Debut Performances
- ఆస్ట్రేలియా సిడ్నీ లో వినూత్నంగా జరిగిన విజయ గొల్లపూడి కథలసంపుటి ‘నీ జీవితం నీ చేతిలో’ మరియు శ్రీ పెయ్యేటి రంగారావు గారి భావగీతాలు ‘రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం
న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల ను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు.
న్యూజెర్సీకి చెందిన నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములను చేయడంలో సాయి గంగుల కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ, నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందించిన విశేష సేవలను కొనియాడారు. న్యూజెర్సీ నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతను చాటుతోందని పేర్కొన్నారు. తెలుగు సమాజానికి మరింత చేరువవుతూ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నాట్స్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పలువురు ప్రముఖ తెలుగు సంఘాల నాయకులు, నాట్స్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆప్టా (APTA), ఆత్మీయ (ATMIYA), మాటా (MATA), తానా (TANA), టీఫాస్ (TFAS), ఎన్‌ఆర్‌ఐవీఏ (NRIVA) సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు సంఘాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సమాజ సేవ పట్ల ఉమ్మడి నిబద్ధతకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి పాల్గొన్నారు.
అలాగే నాట్స్ జాతీయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న నెక్సిల్లో హెల్త్ (Nexillo Health) సంస్థకు చెందిన శశి పర్వతం, బులియన్ ఫార్చ్యూన్ (Bullion Fortune) సంస్థకు చెందిన కల్యాణ్ లక్కింశెట్టి, వంశీకృష్ణ కొప్పురావూరి కూడా ఈ కార్యక్రమానికి హాజరై నాట్స్ సేవా కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ కు అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావంతో అందిస్తున్న సేవలను, నాయకత్వాన్ని ప్రశంసించారు. తెలుగు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజ్ అల్లాడ నొక్కిచెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాల్లో నాట్స్‌తో కలిసి పనిచేయాలని తెలుగు సంఘాలకు పిలుపునిచ్చారు.
తెలుగు సమాజంలో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి నాట్స్ లక్ష్యాలను ఈ సమావేశం మరోసారి చాటిచెప్పింది.
న్యూజెర్సీ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు నాట్స్ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా అవకాశాల కోసం నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్ సాయి గంగులను సంప్రదించవచ్చు మరియు పీఆర్వో (PRO) జీకే మీడియా గణేష్ - కుమార్.
సంప్రదించాల్సిన ఈమెయిల్: natsnj@natsworld.org


