RELATED ARTICLES
ARTICLES
BJP జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !

కాలిఫోర్నియా బే-ఏరియా లో ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం(Overseas Friends of BJP) ఆద్వర్యం లో BJP జాతీయ నాయకులు పేరాల చంద్ర శేఖర్ గారికి ఘన సన్మానం !సెప్టెంబర్ 12 న శుక్ర వారం నాడు అమెరికాలో విసృత పర్యటన చేస్తున్న BJP జాతీయ నాయకులు పేరాల చంద్ర శేఖర్ ( శేఖర్జీ ) గారి గౌరవార్దం అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ పూర్వ విద్యార్దులు మరియు ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం,ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశం బే ఏరియా లోని స్వాగత్ రెస్టారెంటు లో ఘనంగా జరిగింది. దాదాపు 100 మంది ప్రవాస తెలుగు వారు హాజరైన ఈ సమావేశానికి ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం బే ఏరియా coordinator అనూప్ రామగిరి సభికులందరికీ స్వాగతం తెలుపుతూ ప్రారంబించారు. తర్వాత పేరాల చంద్ర శేఖర్ గారిని వేదిక పైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేసారు .చంద్ర శేఖర్ గారు దాదాపు 30 సంవత్సరాలు పైగా పూర్తి సమయం కార్యకర్తగా వివిధ సంఘ్ పరివార్ అనుభంద సంస్థలు రాష్ట్రీయ సేవక్ సంఘ్ లోనూ మరియు విద్యార్ది పరిషత్ లోనూ,అదే విదంగా వారు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్య వర్గ సభ్యుడు గాను , జాతీయ భద్రతా సంఘం యొక్క కన్వీనర్ గాను మరియు ఈశాన్య రాష్ట్రాల సమన్వయ కర్త గా శేఖర్జి చేసిన సేవల గురించి తెలిపారు .

 

ఆ తరువాత ప్రవాస విద్యార్ది పరిషత్ పూర్వ ఉస్మానియా యూనివెర్సిటీ నాయకులుశ్రీ యుగంధర్ రెడ్డి  ప్రసంగిస్తూ గతంలో తాను శేఖర్జీ తో పనిచేసిన అనుభవాలను సభతో పంచుకోన్నారు .శేఖర్జి నాయకత్వం లో ఎన్నో ఉద్యమాలలో,ఆందోళనల్లో పాల్గొనడం వారితో కలిసి స్వదేశీ ఉద్యమం,అల్ కభీర్,కాశ్మీర్ ఉద్యమం ,అయోధ్య ఉద్యమం  లాంటి ఎన్నో ఉద్యమాలలో  పాల్గొనే అవకాశం తనకు కలిగిందని అన్నారు. సమర్ద నాయకత్వం లక్షణాలను విద్యార్ది దశ లో వారి నుంచి నేర్చు కొన్నాను అన్నారు . తరువాత ముఖ్య అతిధి  BJP జాతీయ నాయకులు శ్రీ   పేరాల చంద్ర శేఖర్ రావు మాట్లాడుతూ కాలిఫోర్నియా  లో ఇంతమంది తెలుగు వారి ని ఈ వేదిక ద్వార కలువగలగడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు . దేశ భద్రత, మన దేశ ఈశాన్య రాష్ట్రాల లో సరిహద్దులలో రక్షణ సవాళ్లు భారత ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ను పవర్ పాయింట్  presentation ద్వారా వివరించారు. మన ప్రదాన మంత్రి  మోడీజి వంద రోజుల పాలన గమనించి నట్లయితే  మొదట ప్రమాణ స్వీకారం రోజే సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించి పొరుగుదేశాలతో స్నేహ సంబందాలకు  మోడిజి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రపంచ వ్యాప్తముగా భారత్ శాంతి కాముక దేశమని చాటారని అన్నారు .

మన తీర ప్రాంతం ,సరిహద్దులు  భద్రత చేసుకోవడం  మరియు పొరుగు దేశాల అవసరాలు మేరకు పరస్పర సహకారం వల్ల భారత దేశం అంతర్గతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేపాల్, భూటాన్ ,బంగ్లాదేశ్,శ్రీలంక ,మయన్మార్ ,జపాన్ దేశాలతో స్నేహ సంభందాలు మల్లి  మెరుగు పడే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అన్నారు .


మొదట అమెరికా లాంటి అగ్ర రాజ్యం కూడా భారత్ దేశం కన్నా పాలసీ మేటర్స్ లో  పాకిస్తాన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చెదని మరియు మిత్ర దేశం గా భావించేదని కాని మారిన పరిస్థితుల్లో  ఇప్పుడిప్పుడు భారత్ దేశం వైపు చూస్తూ ఎన్నో పాలసీ లు ఉభయ దేశాల కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నదని అన్నారు . అంతర్జాతీయం గా దౌత్య పరంగా కూడా భారత్ కు మద్దత్తు తెలిపే దేశాలు ఎక్కువ కానున్నాయని అన్నారు . రాబొయే రోజులలో మోడీ జి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించనున్నది అని తెలిపారు.

ప్రవాస భారతీయులు అమెరికన్ పాలసీ సలహాదారులను ప్రభావితం చేసి ఇండో అమెరికన్  ప్రజాస్వామ్య దేశాల మధ్య వారధి లా పని చేయల్చి వుందని తెలిపారు. తరతరాలుగా ప్రపంచానికి భారత్ దేశం ఆధ్యాత్మిక గురువుగా ఆదర్శమై వెలుగు తున్నది . మోడిజి  ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్వహణలో,శిక్షణలో ,సౌకర్యాలలో పెను మార్పులు తీసుకొచ్చి భారతీయ ఆధ్యాత్మిక సంపద ప్రపంచానికి అందేలా చేయడం జరుగుతుందని అన్నారు .   
 
న్యూ యార్క్ మాడిసన్ గార్డెన్ లో సెప్టెంబర్ 28 న జరుగనున్న నరేంద్ర మోడీ గారి సభలో అమెరికా, భారత దేశాల సౌభాగ్యం కోసం కృషి చేస్తున్న ప్రవాస భారతీయులకు ప్రధాన మంత్రి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతారని అన్నారు.ఈ సందర్బంగా పేరాల చంద్ర శేఖర్ గారిని  తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా మాజీ అధ్యక్షులు శ్రీ జయరాం కోమటి గారు మరియు బే ఏరియా  తెలుగు సంఘాల  సభ్యులు అనూప్ ,యుగంధర్ రెడ్డి లు  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో కాలిఫోర్నియా బే ఏరియా  చెందిన  ప్రవాస ప్రముఖులు,విద్యావేత్తలు ,సాఫ్ట్ వేరు ప్రతినిధులు ,డాక్టర్ లు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;