RELATED ARTICLES
ARTICLES
మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు

మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు

 

కౌలాలంపూర్:

మలేషియాలోని బ్రిక్ఫీల్డ్స్ ప్రాతంలోని టానియా గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్‌లో, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.

 

భారతదేశం నుండి ముఖ్య అతిథిగా లోక్ సభ సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్ గారు హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషన్ ప్రతినిధులు, మలేషియా ప్రభుత్వ అధికారులు, మరియు వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు. మహిళలు, పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని, పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, తెలుగు సాంప్రదాయ పాటలతో ఆనందంగా నృత్యాలు చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 

ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమం తెలుగు వారికే కాకుండా, భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడిని ఒక్క చట చేర్చిన ఐక్యతా ఉత్సవం. మలేషియాలో భారతీయ సాంస్కృతిక ఐక్యతకు ఇది అద్దం పట్టింది’ అని పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న భారతీయులు పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు విస్తృతంగా హాజరై (BAM) నిర్వహించిన ఈ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

 

 

BAM ప్రధాన కమిటీ సభ్యులు

* చోప్పరి సత్య – అధ్యక్షుడు

* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు

* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్

* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి

* గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి

* రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు

* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు

* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు

* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు

* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు

* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు

* రహిత – కార్యవర్గ సభ్యుడు

* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు

* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడు

 

 

BAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ: ‘ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు’ అని తెలిపారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;