RELATED ARTICLES
ARTICLES
హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు

 

హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు


2017 లో మన ఉగాది 29 మార్చి 2017 న వచ్చింది.  కాని హాంగ్ కాంగ్ తెలుగు  సమాఖ్య ఈ వేడుకల ని తరువాత  St.Louis & Salesian School ఆవరణ లో జరుపుకుంది.  Don Bosco Missionary’s Father CHAN Hung-kee Mathew, SDB Rector/Director,. స్వాగతం పలుకుతూ  మన సంస్కారము ,  పద్ధతుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు.  ఆయన ఒక ఇంగ్లీషు గీతాన్ని కూడ పాడి అందరి ప్రశంసలకు పాత్రులైనారు .!

ఈ శుభ సందర్భం లో సమాఖ్య తరఫున కొంతమంది ముఖ్య అతిథుల ను గౌరవించింది. వారిలో  ‘Help the Blind Foundation’ స్థాపకులు శ్రీ డి.కె. పటేల్ మరియు  వారి శ్రీమతి నీతి పటేల్ ముఖ్యులు.  వీరి సంస్థ ద్వారా ఇప్పటికి 192 మంది అంధ విద్యార్థులు ఉన్నత చదువులందుకొని ఉద్యోగాల ను పొంది సంతోషంగ జీవితం గడుపుతున్నారు.  ప్రస్తుతం 365 మంది విద్యార్థులు 53 కళాశాలల్లో ఈ సంస్థ యొక్క సహాయాన్ని అందుకొంటున్నారు.  ఈ 365 సంఖ్య ని 1200 చెయ్యాలని ఈ సంస్థ ఉద్దేశ్యము.


హాంగ్ కాంగ్ లో షిరిడి సాయి గుడిని స్థాపించి నడుపుతున్న శ్రీ రమేష్ అమర్నాని, వారి శ్రీమతి జయ అమర్నాని ల ను కూడ తెలుగు సమాఖ్య వేదిక మీద సత్కరించటం జరిగింది.

అలాగే హాంగ్ కాంగ్ లోని సిక్కుల దేవాలయం తరఫునుంచి వచ్చిన శ్రీ శుఖబీర్ సింఘ్ ని ఆ దేవాలయం చేస్తున్న మానవ సేవ ని పేర్కొంటు సత్కరించారు . కూచిపూడి గురువులు  శ్రీ హరి రామ మూర్తి  విశాఖపట్నం నుంచి హాంగ్ కాంగ్  వచ్చిన అవకాశం తీసుకొని వారిని కూడ గౌరవించటం జరిగింది.

 


ఈ సంవత్సరము మన వేడుకల్ని ప్రోత్సాహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందచేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ ముఖ్య అధికారి శ్రీ సురేందర్ రెడ్డి , బ్యాంక్ ఆఫ్ బరోడా ముఖ్య అధికారి శ్రీ కృష్ణమాచారి కి ధన్యవాదాలు తెలుపుకొంటూ గౌరవించటం జరిగింది.


ఇక పోతే వేడుకల విషయానికి వద్దాం.  చి|| సాహితి, సాత్విక, సాయి కీర్తన లు ’ మాతెలుగు తల్లి కి’ అనే పాట తో వేడుకలని ప్రారంభించారు.  మూడు సంవత్సరాల చిన్నారి నాగుల జేస్విక రుద్రమదేవి ఏక పాత్రాభినయo చేసి అందరిని ఆశ్చర్య పరిచింది . పిల్లల – పెద్దల  పాటలు - నృత్య  ప్రదర్శనలతో ఉగాది వేడుకలు ఎన్నో కొత్త అలంకారాలను చేసుకొంది. అందరు కలిసి ఎంతో ఆనందంగా చక్కటి తెలుగు భోజానాని చేసి హేవళoబి నామ సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానించారు .

TeluguOne For Your Business
About TeluguOne
;