RELATED ARTICLES
ARTICLES
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు

 

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
 

 

ఎడిసన్ , న్యూ జెర్సీ :  ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రల ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధించడంతో , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ, అమెరికా వ్యాప్తంగా విజయ్ దివస్ సంబరాలు జరుపుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా  అఫ్ బీజేపీ అధ్యక్షులు, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు మాట్లాడుతూ , ప్రస్తుతం బీజేపీ , యావత్ భారత దేశం లోని 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లను బీజేపీ లేదా బీజేపీ నాయత్కవం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తుంది  అని తెలిపారు. అదేవిధంగా , జనాభా పరంగా చుస్తే , దాదాపుగా 62 శాతానికి అధికంగా  బీజేపీ లేదా బీజేపీ నాయత్కవం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తుంది అని చెప్పారు.

అలాగే, ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రల ఎన్నికల్లో, బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక  పాత్రను గురించి వివరించారు .


తరువాత , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సంగం సభ్యులైన , గుంజన్ మిశ్ర గారు , కల్పనా శుక్ల గారు, దిగంబర్ ఇస్లాంపురే గారు మాట్లాడారు. వారు బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన పాత్రను క్లుప్తంగా వివరించారు.

అదేవిధంగా, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేతలు , టీవీ ఆసియా హెచ్ .అర్. షా గారిని సన్మానించడం జరిగింది.  ఆప్-బీజేపీ  సీనియర్ నేత  జయేష్ పటేల్ గారు హెచ్ .అర్. షా గారు చేసిన సేవలను కొనియాడారు.

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ యూత్ జాతీయ కన్వీనర్, హరీ సేథీ గారు , ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్  గురించి వివరించారు.
పండిట్  దీన్దయాల్ ఉపాధ్యాయ్ గారి శత జయంతి  సందర్బంగా , రక్షపాల్ గారు మాట్లాడుతూ, దీన్దయాల్ గారి జీవితం, మరియు బీజేపీ కి ఆయన చూపించిన మార్గదర్శనం గురించి వివరించారు.

న్యూ జెర్సీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల గారు  మాట్లాడుతూ , అమెరికా లో చేస్తున్న  ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సేవలను కొనియాడుతూ , మోడీ గారి ఆధ్వర్యంలో భారత్ లో మంచి అభివృద్ధి కనబడుతుంది అన్నారు.

ఈ సంబరాల్లో , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేతలు విలాస్ రెడ్డి జంబుల (నేషనల్ యూత్ కో-కన్వీనర్ ), రవి భూధనూరు,  వంశీ యంజాల , ప్రదీప్ కట్ట , బాల గురు , ఆత్మ సింగ్ , కాజోల్ బి , నాగరాజు , శ్రీకాంత్ , శ్రీనివాస్ గనగోని  అలాగే అనేక సంగాల నేతలు  మరియు అనేక మంది ప్రవాస భారతీయులు  ఉత్సహంగా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;