RELATED ARTICLES
ARTICLES
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్

 

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్

ఆగస్ట్ ,16 , 2017 ,న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  అద్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని TV ఆసియ స్టూడియోలో  జరిగింది . ఈ కార్యక్రమంలో, తెలంగాణ భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షులు  మరియు NIAEM డైరెక్టర్ , శ్రీ మధుసూదన్ రెడ్డి గోలి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

శ్రీ మధుసూదన్ రెడ్డి గోలి  గారు ఈ సందర్భముగా కేంద్రంలో ఉన్న శ్రీ మోదీ గారి ప్రభుత్వం రైతులకోసం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాలైన, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, గిట్టుధరల పెంపకం, E -NAM , 24 X 7 విద్యుత్, నదుల అనుసంధానం, వేప పూత పూసిన యూరియా , సాయిల్ హెల్త్ కార్డు మొదలైన వాటిని గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను గురించి తెలిపారు.

అదేవిధముగా, తెలంగాణలో రైతు హత్యలకు దారి తీస్తున్న కారణాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్న అనేక కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు పథకాలు అమలు జరిగితే భారతీయ జనతా పార్టీ కి రాజకీయంగా లబ్ది చేకూరుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వపు పథకాలకు తూట్లు పొడుస్తుంది అన్నారు.

ఈ సందర్భంగా  ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యముగా రైతుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మధుసూదన్ రెడ్డి  గారు సువివరముగా సమాదానాలు చెప్పడం జరింగింది.

ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్,  ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర  ఓఎఫ్ బిజెపీ నేతలు భరత్ రెడ్డి గోలి,  ప్రదీప్ రెడ్డి కట్ట, శ్రవణ్ , సంతోష్ గార్ల తో పాటు తానా నుండి లక్ష్మి  దేవినేని, ఆటా నుండి రవీందర్    , సాయి దత్త పీఠం నుండి రఘు శర్మ , మధు అన్న , స్వరజ్ నుండి  జగదీశ్వర్ , అనంత్ ,  టాటా నుండి మేకల సతీష్   చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;